తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉత్సాహంగా వైద్యుల వివాహ వధూవరుల పరిచయ వేదిక - Eenadu Pellipandir

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు ఆ పంట పండాలి అంటే వధూవరుల ఎంపిక కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడాలి. ఈ ఎంపికలో ఒక్కటైన జంటలు  కలిసి ఏడడుగులు వేసి జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటారు. ఈ తంతు జరగాలంటే ముందుగా ఇరువురికి పరిచయం ముఖ్యం. అందుకోసం ఈనాడు పెళ్లిపందిరి డాట్ నెట్ ఏర్పాటు చేసిన పరిచయ వేదిక ఆద్యంతం ఉత్సాగంగా సాగింది.

ఉత్సాహంగా వైద్యుల వివాహ వధూవరుల పరిచయ వేదిక

By

Published : Aug 25, 2019, 5:05 PM IST

హైదరాబాద్ కొత్తపేట డివిజన్ పరిధిలోని వైష్ణవి హాల్​లో ఈనాడు పెళ్లిపందిరి డాట్ నెట్ ఆధ్వర్యంలో వైద్యుల వివాహ వధూవరుల పరిచయ వేదిక నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి సుమారు 300 మంది హాజరై తమ పేర్లను నమోదు చేసుకున్నారు. పరిచయ వేదికపై వివరాలను ప్రదర్శిస్తూ వివరాలు తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. వేతనం, కుటుంబ నేపథ్యం, అభిరుచులు, అలవాట్లు వంటివి వేదికలో హజరైనవారికి వివరించారు. ఒక్కొక్కరినీ వేదికపైకి పిలిచి వారిని పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఈనాడు యూనిట్ మేనేజర్ రమేష్ బాబు, ఈనాడు పెళ్లిపందిరి చీఫ్ మేనేజర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా వైద్యుల వివాహ వధూవరుల పరిచయ వేదిక

ABOUT THE AUTHOR

...view details