రాష్ట్రంలో ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌ను తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ తిరిగి ప్రారంభించింది. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఆవిష్కర్తలను ఆన్లైన్లో ప్రదర్శించవచ్చని ప్రకటించింది.
ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం పునః ప్రారంభం - intinta innovator exhibition program on august 15th
ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ తిరిగి ప్రారంభించింది. ఆగస్టు 15 న అన్ని జిల్లాల్లోని ఔత్సహికులు తమ ఆవిష్కరణలు ప్రదర్శించవచ్చని ప్రకటించింది. ఈ ప్రదర్శన కోసం ఆవిష్కర్తలు ముందుగా నమోదు చేసుకోవాలని సూచించింది.
intinta innovator exhibition program on august 15th
తమ ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వాక్యాలు, రెండు నిమిషాల వీడియోను, ఆవిష్కరణకు సంబంధించిన నాలుగు ఫోటోలు, ఆవిష్కర్త వివరాలను 9100678543 నెంబర్‌కు పంపించి నమోదు చేసుకోవాలని తెలిపింది.
ఇవీచూడండి:పత్తికి 'తెలంగాణ బ్రాండ్'!.. మార్కెటింగ్ శాఖ కసరత్తు
TAGGED:
Innovation, TSIC