ధనం చుట్టూ రాజకీయాలు తిరగడం దురదృష్టకరమని.. హైదరాబాద్లో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈసీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
'ఈసీ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది' - ఇంటి పార్టీ సమావేశం
మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఇష్టారాజ్యంగా ధన ప్రవాహాన్ని ప్రేరేపిస్తుందని.. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని ఇంటి పార్టీ అధ్యక్షుడు సుధాకర్ ఆరోపించారు.
'ఉద్యమకారులనే గెలిపిద్దాం'
రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారు కాకుండా ఏ విధంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఇంటి పార్టీ ఉద్యమకారులకు మద్ధతు ఇస్తుందని.. అభ్యర్థి ఏ పార్టీ వారైనా ఉద్యమంలో కష్టపడ్డ వాళ్లకు గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: మున్సిపాలిటీగా అవతరించిన నందికొండ కథేంటీ...!