అనవసర సైట్లు ఓపెన్ చేస్తే అంతే..! సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ప్రస్తుతం మన జీవితంలో ఇంటర్నెట్ అనేది తప్పనిసరయింది. చదువు, వ్యాపారం, ఉద్యోగం ఎదైనా ఇంటర్నెట్తో అనుసంధానం అయింది. మన పని చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇతర సోషల్ మీడియా, అనవసరమైన విషయాల్లోకి వెళ్తే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డట్లే.
సైబర్ నేరస్తులు చేసే ఫోన్ కాల్స్, మెసేజ్‌లను గుర్తించే అవకాశం ఉందా, వాటినుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలి?
ఈ మధ్య కాలంలో బల్క్ ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు. ఇండియా మొత్తం పంపిస్తారు. మీకు ఎస్బీఐ రివార్డ్స్ వచ్చాయని.. వెంటనే మీరు రెమెడీ చేసుకోవాలని వస్తే వెంటనే మనం వారు పంపే నీలం, పింగ్ కలర్ లింక్‌ను క్లిక్ చేస్తాం, మనిషికి అశ ఎక్కువ, సైబర్ నేరగాళ్లు ఎప్పుడూ మనిషి బలహీనతలను గుర్తించి మోసాలకు పాల్పడుతున్నారు.
ప్రస్తుతం కేవైసీ ఫ్రాడ్ కేసులు ఎక్కువవుతున్నాయి. ట్రెండ్ మారుస్తూ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లపై ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి?
నిజమే, ఇటీవల లాక్డౌన్ సమయంలో చాలా కేసులు వచ్చాయి, చాలా మంది ఫోన్లకు, ఎస్ఎంఎస్లకు స్పందించారు. మీ పేటిఎంకు కేవైసీ అప్డేట్ చేయాలి లేదంటే బ్లాక్ చేయబడుతుందని అనగానే మోసపోతున్నారు. పేటీఎం కేవలం వాలెట్ మాత్రమే అది అకౌంట్ కాదు, ఎన్ని సార్లైనా తీసివేసుకోవచ్చు.
మోసపోయిన వ్యక్తి ఎంత సమయంలో ఫిర్యాదు చేయాలి? ఎలా చేయాలి? ఆ డబ్బును తిరిగి పోందే అవకాశం ఉందా?
మోసపోయిన వ్యక్తి గంట, రెండు గంటల్లో ఫిర్యాదు చేసినట్లైతే లావాదేవీలు జరగకుండా ఆపడానికి వీలుంది. చాలా మందికి డబ్బు రికవరీ చేసి ఇచ్చాం.
ఇవీ చూడండి:జగన్ జల దోపిడీకి కేసీఆర్ అండ: రేవంత్‌రెడ్డి