నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందన ఏంటి.?
నూతన వ్యవసాయ చట్టాల(repeal of new farm laws) రద్దు.. భారత రైతుల విజయం. ఏడాది కాలంగా దిల్లీలో పోరాటం చేస్తున్న, ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల విజయం. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా నిన్న తెరాస ఆధ్వర్యంలో చేపట్టిన మహా ధర్నాలో సీఎం కేసీఆర్ ఇచ్చిన అల్టిమేటం ఫలితం ఇది. సాగు చట్టాలను(Minister Jagadish reddy on new farm laws) కేంద్రం తాత్కాలికంగా కాదు.. శాశ్వతంగా ఉపసంహరించుకోవాలి.
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. నిన్న తెరాస ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. కేంద్రం నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు.?
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అడుగుతున్నాం. కొంటారా.. కొనరా అని ప్రశ్నిస్తున్నాం. ధాన్యం కొనడానికి కేంద్రానికి ఉన్న సమస్యలు ఏంటో చెప్పాలి.? సంవత్సరానికి ఏ రకం వడ్లు ఎన్ని కొంటారో చెబితే.. అందుకు అనుగుణంగా మేము రైతుల(Minister Jagadish reddy on new farm laws)ను సన్నద్ధం చేసుకుంటాం. ఏడాదికి తగిన ప్రణాళిక ముందే ఇవ్వమని చెబుతున్నాం. కేంద్రం బహిరంగంగా చెబితే ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. రైతులను అందుకు అనుగుణంగా పంటలు వేసేలా సిద్ధం చేస్తాం. దేశ ఆహార అవసరాలు, నిల్వలు ఎన్ని పెట్టుకోవాలి.. వాటిపై కేంద్రానికి స్పష్టత ఉండాలి. అదే విషయాన్ని నిన్న మహాధర్నాలో కేసీఆర్.. కేంద్రానికి సూచించారు. రాష్ట్ర భాజపా నాయకులు అనవసరంగా ఇక్కడ గందరగోళం సృష్టిస్తున్నారు.
యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్రం చెబుతోంది. దీనిపై మీరు ఏం చెప్పదలుచుకున్నారు.?