ప్రశ్న: కేంద్రపాలిత ప్రాంతాల్లో డిస్కంలను ప్రైవేటుపరం చేస్తామనే ప్రతిపాదనలు వస్తున్నాయి.. ఈ ప్రభావం విద్యుత్‌రంగంపై ఏవిధంగా ఉంటుంది?
జవాబు:డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను ప్రైవేటుపరం చేస్తామనడం విద్యుత్‌రంగాన్ని ప్రైవేటుపరం చేయాలనుకోవడంలో భాగమే. ఇది కేంద్రపాలిత ప్రాంతాలతోనే ఆగదు. మిగిలిన రాష్ట్రాలలోను ప్రైవేటు పరం చేయాలనే నిర్ణయాన్ని మనం చూశాం. కరోనా పరిస్థితిలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తామనే ప్రకటనలు రావడం బాధాకరం. ఈ పరిస్థితిలో విద్యుత్‌రంగ సంస్థలు.. కార్మికులు, ఉద్యోగులు, ఇంజినీర్లు అందరూ కేంద్ర మంత్రి ప్రకటనపై భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రక్రియను అడ్డుకోడానికి జాతీయ స్థాయిలో విద్యుత్‌రంగ ఉద్యోగులు, ఇంజినీర్లు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వాల ఆధీనంలోనే పభుత్వరంగ సంస్థలు విజయం సాధియనడానికి తెలంగాణ, కేరళ తదితర రాష్ట్రాలను చూస్తున్నాం. నష్టాలు రావడానికి చాలా కారణాలున్నాయి. ఉత్పత్తి ఖర్చులు పెరగడం ఇతర వ్యయాలు ఉన్నాయి. వాటిని తగ్గించుకోడానికి ప్రయత్నించాలి. ప్రైవేటుపరం చేయడం వల్ల ధరలు తగ్గాయా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
ప్రశ్న: ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్లు నష్టాల్లో ఉన్నాయి.. ఈ ప్రైవేటీ కరణ నిర్ణయం వాటిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
జవాబు: ప్రైవేటీకరణ వల్ల వినియోగదారులకు క్రాస్ సబ్సిడి తగ్గించాల్సి వస్తుంది.
ప్రశ్న: రాయితీలను విద్యుత్ వినియోగదారులకు నేరుగా నగదు బదిలీ ద్వారా చెల్లిస్తామంటున్నారు... అది ఎంతవరకు సమంజసం?
జవాబు: ప్రస్తుత రోజుల్లో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ముందుగా విద్యుత్ బిల్లును ఎలా చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే సరఫరా నిలిపేయాల్సి వస్తుంది. గృహ వినియోగదారులకు కూడా ప్రభుత్వం నుంచి సబ్సిడీ రాకపోతే పేద, మధ్యతరగతి కుటుంబాల వారు ప్రతినెలా వేలల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తే చాలా ఇబ్బంది పడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది.