ఇవీ చదవండి:వాగును తలపిస్తోన్న రహదారి.. మోకాళ్ల లోతు వరదతో వాహనదారుల ఇక్కట్లు
రాష్ట్రంలో మరో మూడ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు: డాక్టర్ నాగరత్న - హైదరాబాద్ తాజా వార్తలు
Imd Director Nagaratna Interview: రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలకు మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఈ సీజన్లో సగటు వర్షాపాతం కంటే అత్యధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలతో పాటు గట్టి జల్లులు పడే అవకాశం ఉందని చెప్పారు. రాగల నాలుగైదు వారాలు వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయంటున్న వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్నతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
డాక్టర్ నాగరత్న