అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి మూడు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్‌రావు వెల్లడించారు. మెట్రో నగరాల్లో దొంగలించిన కార్లకు ఉన్న జీపీఎస్ తొలగించి వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని డీసీపీ పేర్కొన్నారు. పుణేకు చెందిన నిదీష్, వినాయక్ కళాంకర్ మరో ముగ్గురు మిత్రులతో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నారని డీసీపీ తెలిపారు. ఓఎల్‌ఎక్స్, ఫేస్‌బుక్‌లలో అద్దెకు కార్లు ఇచ్చే వాళ్లకు ఫోన్‌లు చేసి తాము సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పరిచయం చేసుకుని, నకిలీ ఐడీ కార్డులు చూపించి నకిలీ చెక్కులు ఇచ్చి కారుతో ఉడాయించే వారని వెంకటేశ్వర్‌రావు అన్నారు. ఈ ముఠా ఇప్పటి వరకు హైదరాబాద్, గోవా, పుణే, పాండిచ్చేరి నగరాల్లో ఆరు కార్లను చోరీ చేసినట్లు డీసీపీ తెలిపారు.
అంతర్రాష్ట్ర వాహన దొంగల అరెస్టు - hyderbad police
ఓఎల్‌ఎక్స్, ఫేస్‌బుక్‌లలో అద్దెకు కార్లు ఇచ్చే వాళ్లని నమ్మించి మోసం చేస్తున్న దొంగల ముఠాను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అంతర్రాష్ట్ర వాహన దొంగల అరెస్టు