తెలంగాణ

telangana

ETV Bharat / state

400 దొంగతనాలు: చదువుకుంది మూడు.. చోరీల్లో పీహెచ్​డీ! - 400 theft case were recorded on interstate thief thanedhar singh

అతడు చదువుకుంది మూడో తరగతి.. దొంగతనాల్లో మాత్రం పీహెచ్​డీ చేశాడు. పూణే నుంచి సికింద్రాబాద్​కు వచ్చే రైళ్లలో మిఠాయిలు, తంబాకు విక్రయిస్తూ జీవించిన అతడు చోరీల బాట పట్టాడు. ప్రయాణికుల సొమ్ము అపహరించి విలాసవంతమైన జీవనం గడిపాడు. చివరికి కటకటాలపాలయ్యాడు.

చదువుకుంది మూడు.. చోరీల్లో పీహెచ్​డీ
చదువుకుంది మూడు.. చోరీల్లో పీహెచ్​డీ

By

Published : Dec 24, 2019, 8:49 PM IST

చదువుకుంది మూడు.. చోరీల్లో పీహెచ్​డీ
అతడు చదువుకున్నది మూడో తరగతి. పూణే నుంచి సికింద్రాబాద్​కు వచ్చే రైళ్లలో స్వీట్లు, తంబాకు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. ఆ క్రమంలో రైళ్లలో దొంగతనాలకు పాల్పడే వారితో చేతులు కలిపాడు. దొంగతనాల్లో ఆరితేరి ప్రయాణికుల జేబులు గుల్ల చేయడంలో సిద్ధహస్తుడయ్యాడు. బ్లేడ్​ను ఉపయోగిస్తూ ఎదురు తిరిగిన వాళ్లపై బెదిరించి మరి వారినుంచి డబ్బులు లాక్కుని వెళ్ళేవాడు. రైళ్లలో పడుకున్న ప్రయాణికులను, రైలు ఎక్కేటప్పుడు హడావిడిగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే వాడు.



విలాసవతమైన జీవనం:

విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. దొంగతనం చేసిన సొమ్ము వేలాది రూపాయలతో విలాసవంతమైన ఇళ్లలో అద్దెకుంటూ, లక్షలు వెచ్చించి తన పిల్లలను స్కూల్లో చేర్పించాడు. చివరికి బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద దొంగతనానికి పాల్పడే క్రమంలో పోలీసులకు చిక్కాడు. రైల్వే పోలీసులు అతన్ని అరెస్టు చేసి 40 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, డబ్బు స్వాధీనం చేసుకున్నారు.

అయితే అతను అంతర్రాష్ట్ర దొంగ తానేదార్​ సింగ్​ అని.. ఉత్తరప్రదేశ్​కి చెందినవాడిగా గుర్తించినట్లు సికింద్రాబాద్​ రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. 2004 నుంచి నేరచరిత్ర ఉందన్నారు. ఇప్పటివరకు అతడు 400కు పైగా దొంగతనాలు చేశాడని తెలిపారు. త్వరగా డబ్బు సంపాదించాలన్న దురాశతో గత కొన్నేళ్లుగా చోరీలు చేస్తున్నట్లు అనురాధ పేర్కొన్నారు.

ఇవీ చూడండి: హైకోర్టుకు దిశ నిందితుల రీపోస్టుమార్టం వీడియో సీడీ

ABOUT THE AUTHOR

...view details