Interstate Ganja Gang Arrested in Hyderabad :తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే ఆశతో.. కర్ణాటక బీదర్‌కి చెందిన మోహన్ రాథోడ్, సంతోష్ గంజాయి స్మగ్లర్ అవతారమెత్తారు. ఒడిషా నుంచి గంజాయి తీసుకొచ్చి.. హైదరాబాద్ పాతబస్తీ సహా ఇతర ప్రాంతాలకి రవాణా చేస్తుంటారు. మోహన్ రాథోడ్ ప్రధాన స్మగ్లర్ కాగా గోపాల్, సంతోష్ అతని అనుచరులుగా వ్యవహరిస్తుంటారు. ఇటీవలే వచ్చిన ఆర్డర్ మేరకు వారం క్రితం ఒడిషా నుంచి.. 430 కిలోల గంజాయి హైదరాబాద్ తరలించాల్సి ఉంది. ఎన్నికల వేళ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తుండటంతో మోహన్ రాథోడ్ కొత్త పథకం రచించారు.
Ganja Gang Arrested in Hyderabad :పిల్లర్ల నిర్మాణానికి ఉపయోగించే ఇనుప డబ్బాల్లో భాగ్యనగరానికి సరుకు చేరవేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా 8 డబ్బాలు కొనుగోలు చేసి ఒడిషాకి తీసుకెళ్లారు. అనంతరం గంజాయిని ఆ డబ్బాల్లో నింపి ఇనుప మూతలతో వెల్డింగ్ చేశారు. నాచారానికి చెందిన ఆటో డ్రైవర్‌ని సంప్రదించిన నిందితులు.. పిల్లర్ డబ్బాలను ఒడిషా నుంచి తేవాలంటూ చెప్పారు. నిజమేనని నమ్మిన ఆటో డ్రైవర్ బాబురావు తన స్నేహితుడు లాలాపేటకు చెందిన మద్దెల రమేశ్‌ని.. వెంట తీసుకెళ్లాడు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరారు. మోహన్‌రాథోడ్, గోపాల్, సంతోష్ మరో పైలట్ వాహనంలో పోలీసు తనిఖీలు చూసుకుంటూ వస్తున్నారు.
Ganjayi Supply in Telangana :కొందరు రహస్యంగా.. హైదరాబాద్ మీదుగా గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆటోలో పిల్లర్ డబ్బాలు అధిక బరువు ఉండడం.. వాహనంలోని ముగ్గురి ప్రవర్తన అనుమానంగా ఉండడంతో ఆటోను పరిశీలించగా.. అసలు విషయం వెలుగుచూసింది.ఇసుప డబ్బాల్లో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు తొలుత గంజాయిని హైదరాబాద్‌కి చేర్చి ఇక్కడ నుంచి హర్యానా, మహారాష్ట్ర, దిల్లీకి సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఒడిషా నుంచి ఇప్పటికే మూడుసార్లు గంజాయి చేరవేసినట్లు విచారణ తేలింది. ప్రధాన నిందితుడు మోహన్ రాథోడ్‌పై గతంలో మహారాష్ట్రలో గంజాయి కేసు ఉందని.. రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ తెలిపారు. రసాయనాలు తరలించే లారీట్యాంకర్లలో గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా పోలీసులకు చిక్కింది.