ధ్యానంతో ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు సాధించవచ్చని రైల్వే సిబ్బందికి దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య సూచించారు. సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని ఇండోర్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య, అడిషనల్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‌తో పాటు..అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
యోగా వల్ల స్థిరమైన ఆలోచనలు వస్తాయి: ద.మ.రైల్వే జీఎం - తెలంగాణ తాజా వార్తలు
నిత్యం యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు... స్థిరమైన ఆలోచనలు వస్తాయని ద.మ.రైల్వే జీఎం గజానన్ మాల్య పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని ఇండోర్ స్టేడియంలో ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.
తెలంగాణ వార్తలు
కొవిడ్ దృష్ట్యా భౌతిక దూరం పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా దినోత్సవంలో భాగంగా జోన్ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ మొత్తం 6 డివిజన్లు ఇతర రైల్వే వర్క్ షాపులలో, ట్రైనింగ్ కేంద్రాల నుంచి రైల్వే సిబ్బంది వర్చువల్ విధానంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.