అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని... టీఎన్జీవో కేంద్ర సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు జరిగాయి. రెండు రోజుల పాటు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ పోటీలను... క్రీడా ప్రాధికారక సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి, మహిళ విభాగం ఛైర్ పర్సన్ బండారు రేచల్ ప్రారంభించారు.
టీఎన్జీవో కేంద్రంలో ఘనంగా మహిళా దినోత్సవ సంబురాలు - టీఎన్జీవో కేంద్రంలో ఘనంగా మహిళా దినోత్సవ సంబురాలు
హైదరాబాద్ నాంపల్లిలో టీఎన్జీవో కేంద్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర కార్యాలయంలో క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు.

క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయి : రేచల్
టీఎన్జీవో కేంద్రంలో ఘనంగా మహిళా దినోత్సవ సంబురాలు
క్రీడలే మానసిక ఉల్లాసం...
మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడల్లో ఉద్యోగిణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విరోచిత పోరాటాల స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధే లక్ష్యంగా ఈ సంబురాలు జరుపుకున్నట్లు రేచల్ వివరించారు. నాలుగు గోడల మధ్య అనునిత్యం ఒత్తిడితో పని చేసే ఉద్యోగిణులకు ఈ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఆమె పేర్కొన్నారు. ప్రతీరోజు వ్యాయామం తప్పనిసరిగా అలవర్చుకోవాలని ఆమె సూచించారు.
TAGGED:
Tngo Women's Sport's Meet