తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతి మహిళా స్వశక్తితో ఎదిగి... పురుషులతో సమానంగా రాణించాలి'

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ప్రతి మహిళా స్వశక్తితో ఎదగాలని సంఘం అధ్యక్షురాలు మమత కోరారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులను సన్మానించారు.

By

Published : Mar 6, 2021, 7:18 PM IST

international-womens-day-celebrations-by-telangana-gazetted-officers-association-at-nampally-in-hyderabad
'ప్రతి మహిళా స్వశక్తితో ఎదిగి... పురుషులతో సమానంగా రాణించాలి'

'ప్రతి మహిళా స్వశక్తితో ఎదిగి... పురుషులతో సమానంగా రాణించాలి'

ప్రతి మహిళ స్వశక్తితో జీవితంలో ఎదగడంతో పాటు... పురుషులతో సమానంగా రాణించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత కోరారు. ప్రస్తుత సమాజంలో మహిళలకు ఎన్నో అవకాశాలున్నాయని... వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను... సమర్థవంతంగా ప్రజలకు చేరే విధంగా కృషి చేయాలన్నారు. సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.

మహిళా రక్షణ కోసం చట్టాలను మరింత పటిష్ఠం చేసి... సత్వర న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులను మమత సన్మానించారు. ఈ సందర్భంగా మహిళా అధికారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. నాంపల్లిలోని టీజీవో భవన్‌లో జరిగిన ఈ వేడుకల్లో సంఘం అధ్యక్షురాలు మమతతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:మహాశివరాత్రి వేడుకలకు శ్రీకాళహస్తీశ్వరాలయం ముస్తాబు

ABOUT THE AUTHOR

...view details