గోలి శ్యామల భయపడకుండా స్విమ్మింగ్ చేసి మన రాష్ట్రానికి గొప్ప పేరు తేవాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో స్విమ్మింగ్ పోటీల్లో అనేక పథకాలు సాధించిందన్నారు. ప్రపంచం గర్వించేటట్లు శ్రీలంకలోని తలైమన్నర్ నుంచి ధనుశ్ కోటి వరకు సాహస యాత్రను విజయవంతంగా పూర్తి చేయాలని ఆయన కోరారు.
గోలి శ్యామల సాహస యాత్ర జెర్సీని ఆవిష్కరించిన మంత్రి - తెలంగాణ స్విమ్మర్ గోలి శ్యామల
రాష్ట్రానికి చెందిన ఇంటర్నేషనల్ స్విమ్మర్ గోలి శ్యామల సాహస యాత్ర జెర్సీ, బ్రోచర్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి ధనుశ్ కోటి వరకు సాహస యాత్రను విజయవంతంగా పూర్తి చేయాలని ఆయన కోరారు.
గోలి శ్యామల సాహస యాత్ర జెర్సీని ఆవిష్కరించిన మంత్రి
తెలంగాణకు చెందిన ఇంటర్నేషనల్ స్విమ్మర్ గోలి శ్యామల సుమారు 30 కిలోమీటర్ల సాహస యాత్ర జెర్సీ, బ్రోచర్లను మంత్రి ఆవిష్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గోలి శ్యామలకు అవార్డుతోపాటు లక్ష రూపాయల చెక్కును అందించి ప్రోత్సహించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, క్రీడా శాఖ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
ఇదీ చూడండి :అక్కరకు రాని ప్లాస్టిక్‌తో.. పనికొచ్చే వస్తువులు