తెలంగాణ

telangana

By

Published : Feb 22, 2019, 5:30 PM IST

ETV Bharat / state

జూన్​లో విత్తన సదస్సు

దేశ ఆర్థిక వ్యవస్థకే వెన్నుముకగా నిలిచే వ్యవసాయంలో విత్తనానిది కీలక భూమిక. జన్యు స్వచ్ఛత, నాణ్యమైన విత్తనోత్పత్తికి విత్తన రంగంలో చేపడుతున్న కార్యక్రమాలు, పరిజ్ఞానం పెంచుకోవడానికి ఈ ఏడాది జూన్‌లో భాగ్యనగరంలో అంతర్జాతీయ విత్తన సదస్సు నిర్వహిస్తున్నారు.

జూన్​లో విత్తన సదస్సు

జూన్​లో విత్తన సదస్సు

రాష్ట్రం నుంచి విత్తన ఎగుమతులు ప్రోత్సహించేందుకు ఎఫ్‌ఏఓ భారత విభాగం ముందుకొచ్చింది. తెలంగాణ విత్తనోత్పత్తి, వ్యవసాయ విధానంపై అధ్యయనం చేయడానికి త్వరలో ఎఫ్‌ఏఓ బృందం హైదరాబాద్ రానుంది. జూన్‌లో భాగ్యనగరంలో జరగనున్న అంతర్జాతీయ విత్తన సదస్సు - ఇస్టా కాంగ్రెస్‌లో భాగంగా విత్తనోత్పత్తి, నాణ్యత అంశాలపై ముందస్తు సమావేశం జరగనుంది. ఈ వర్క్‌షాపుకు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి 50 మంది విత్తన ప్రముఖులు హాజరుకానున్నారు.

సదస్సు ఏర్పాట్లపై చర్చ

దిల్లీలో ఎఫ్‌ఏఓ భారత ప్రతినిధి టోమియో సిచారాతో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సదస్సులో చర్చించాల్సిన అంశాలు, నిర్వహణ, ఏర్పాట్లపై ఎఫ్‌ఏఓ ప్రతినిధులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ సంచాలకులు డాక్టర్ కేశవులు పాల్గొన్నారు.

ఇవీచదవండి:కొచ్చర్​కు లుక్ ​అవుట్​

ABOUT THE AUTHOR

...view details