తెలంగాణ

telangana

ETV Bharat / state

13 నుంచి స్వీట్లు తింటూ పతంగులు ఎగరేద్దాం.. రండి... - International Pantheon Festival from the 13th

సంక్రాంతిని పురస్కరించుకుని అంతర్జాతీయ పతంగుల పండుగను గొప్పగా నిర్వహించనున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, క్రీడా, అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ వెల్లడించారు. ఈనెల 13 నుంచి 15 వరకు జరిగే ఈ పండుగకు ఇతర రాష్ట్రాలు, 50 దేశాల నుంచి పతంగుల బృందాలు పాల్గొంటాయని పేర్కొన్నారు.

International Pantheon Festival from the 13th january at hyderabad
13 నుంచి అంతర్జాతీయ పతంగుల పండుగ

By

Published : Jan 6, 2020, 4:59 PM IST

Updated : Jan 6, 2020, 9:25 PM IST

హైదరాబాద్​ బేగంపేటలో ఇంటర్నేషనల్‌ కైట్‌ అండ్ స్వీట్ ఫెస్టివల్​పై మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ నేతృత్వంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 2020 బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు. సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో ఈనెల 13 నుంచి 15 వరకు పతంగుల పండుగ నిర్వహించనున్నారు. దేశంలోని 25 రాష్ట్రాల కైట్‌ టీమ్‌లతో పాటు 50 దేశాల నుంచి పతంగుల బృందాలు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ పతంగుల పండుగతో పాటు సంప్రదాయ ఆటలు ఉంటాయన్నారు.

వేయి రకాల వెరైటీలతో స్వీట్లు, స్నాక్స్

అవసరమైతే ఈ వేడుకల సమయాన్ని పొడిగిస్తామని మంత్రి తెలిపారు. మూడు రోజుల పాటు వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా కార్యక్రమాలు ఉంటాయి. సుమారు 1000 రకాల భోజన వంటలు, మిఠాయిలు, స్నాక్స్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వివరించారు.

సమావేశంలో రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, పర్యాటకశాఖ ఎండీ మనోహర్​తో పాటు వివిధ ప్రభుత్వశాఖలకు సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు.

13 నుంచి స్వీట్లు తింటూ పతంగులు ఎగరేద్దాం.. రండి...

ఇదీ చూడండి : కాలుష్యం నుంచి కాపాడే శిరస్త్రాణం

Last Updated : Jan 6, 2020, 9:25 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details