తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్యాంక్​బండ్​పై ఘనంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవం

హైదరాబాద్​ ఎన్టీఆర్ పార్క్ వద్ద సేవ్​ ఇండియా ఆధ్వర్యంలో పురుషుల దినోత్సవాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని నవంబర్ 19 న జరుపుకుంటారని... అందులో భాగంగా ఈ రోజు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ట్యాంక్​బండ్​పై ఘనంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవం

By

Published : Nov 24, 2019, 9:54 PM IST

అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని సేవ్ ఇండియా ఫ్యామిలీ స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్​లో ఘనంగా నిర్వహించింది. ఎన్టీఆర్ పార్క్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో... సమాజంలో పురుషులకు జరుగుతున్న అన్యాయాలు, హక్కులపై సంతకాల సేకరణ చేపట్టారు. పురుషులతో పాటు మహిళలు, చిన్నారులు సంతకాలు చేసి మద్దతు తెలుపుతూ... పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని నవంబర్ 19 న జరుపుకుంటారని... అందులో భాగంగా ఈ రోజు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

పురుషుల మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణలతోపాటు... వారి జీవితాలను మెరుగుపరచడానికి తమ సంస్థ పనిచేస్తుందని వారు స్పష్టం చేశారు.

ట్యాంక్​బండ్​పై ఘనంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవం

ఇవీచూడండి: సాయం చేయండి.. పసివాడికి ప్రాణం పోయండి

ABOUT THE AUTHOR

...view details