ఈ సంవత్సరం కైట్, స్వీట్ ఫెస్టివల్స్‌తో పాటు స్నాక్స్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నామని వెంకటేశం ప్రకటించారు. భవిష్యత్తులో ఈ వేడుకను మూడు రోజుల నుంచి వారం పాటు నిర్వహిస్తామన్నారు. జింఖానా మైదానంలో క్రీడా విభాగం ఆధ్వర్యంలో పురాతన, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలు ప్రతిబింబించే ఆటలను నిర్వహిస్తామని బుర్రా వెంకటేశం పేర్కొన్నారు.
'భవిష్యత్తులో వారం రోజులపాటు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్'
అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను భవిష్యత్తులో మూడు నుంచి వారం రోజుల పాటు నిర్వహిస్తామని తెలంగాణ సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఈ నెల 13, 14, 15 తేదిల్లో నిర్వహిస్తున్న ఐదో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ వేడుకలో పది దేశాలతో పాటు మన దేశంలో 25 రాష్ట్రాల ప్రజలు భారీగా పాల్గొంటారని వెంకటేశం తెలిపారు.
'భవిష్యత్తులో వారం రోజులపాటు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్'