తెలంగాణ

telangana

ETV Bharat / state

"అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు" - international kidney rocket gang arrested

​ ఫేస్​బుక్​లో కిడ్నీ కావాలనే ప్రకటన చూసి... ఆ ఖాతాదారునికి ఫోన్​ చేశాడో యువకుడు. 20 లక్షల రూపాయలకు తన కిడ్నీ అమ్ముకోవడానికి సిద్ధపడ్డాడు. సర్జరీ చేసి కిడ్నీ తీసుకుని డబ్బు ఇవ్వకుండా మోసం చేసిందా ముఠా. ఇలాంటి అమాయకులను నమ్మించి మాయమాటలు చెప్పి విదేశాలకు తీసుకెళ్లి కిడ్నీలు సేకరిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు.

"అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ముఠా  గుట్టు రట్టు"

By

Published : Apr 1, 2019, 8:20 PM IST

Updated : Apr 1, 2019, 11:27 PM IST

కిడ్నీ ముఠా అరెస్టు
అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ ముఠా గుట్టు రట్టైంది. మాయమాటలు చెప్పి విదేశాలకు తీసుకెళ్లి కిడ్నీలను సేకరించి మోసం చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.

ముఠాలో ముగ్గురు సభ్యులు

అమ్రిశ్ ప్రతాప్​ను ఈ ముఠాకు ప్రధాన సూత్రధారునిగా గుర్తించారు. సందీప్‌ కుమార్ అలియాస్​ అమ్రిశ్​ ప్రతాప్​, రింకీ అనే యువతీయువకులతో పాటు మరొకరు ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారని వెల్లడించారు.

ఫిర్యాదుతో కదలిన డొంక

ఫిబ్రవరి 5న వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా ఈ ముఠా బాగోతం వెలుగులోకి వచ్చిందన్నారు. నిందితుడు దాతలను, రోగులను టర్కీ, శ్రీలంక దేశాలకు తీసుకెళ్లి మోసగిస్తున్నారని సీపీ వివరించారు. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశామని ఇంకా ఎవరెవరున్నారనేది తేలుస్తామని మహేశ్‌ భగవత్‌ పేర్కొన్నారు.

ఇవీ చూడండి:'చే' జారి కారెక్కిన సునీతాలక్ష్మారెడ్డి

Last Updated : Apr 1, 2019, 11:27 PM IST

ABOUT THE AUTHOR

...view details