హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాగి, బియ్యంతో తయారు చేసిన కేక్‌ను ఏర్పాటు చేసి చెరుకు, పైనాపిల్, బెల్లం, కొబ్బరికాయతో ఏనుగుల కోసం జూ అధికారులు విందును ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ జూలో ఘనంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం - hyderabad zoological park celebrates international elephant day
ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో వైభవంగా జరిపారు. ప్రస్తుతం జూలో ఉన్న 5 ఏనుగులు కోసం రాగి, బియ్యంతో తయారుచేసిన కేక్‌ను, చెరుకు, పైనాపిల్, బెల్లం కొబ్బరికాయలతో వాటికి విందును ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ జూలో ఘనంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం
కార్యక్రమంలో ఎన్. క్షితిజ ఐఎఫ్ఎస్ క్యురేటర్, నాగమణి డిప్యుటీ క్యురేటర్, సతీష్‌బాబు అసిస్టెంట్ క్యురేటర్ ఇతర జూపార్కు సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం నెహ్రూ జూలాజికల్ పార్కులో 5 ఏనుగులు(1 మగ, 4 ఆడ) ఉన్నట్లు అధికారులు తెలిపారు. అన్ని ఏనుగులు మంచి ఆరోగ్య స్థితిలో ఉన్నాయని జూ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:'కోజికోడ్ విమానాశ్రయ రన్‌వే సురక్షితమైనదే'
TAGGED:
ప్రపంచ ఏనుగు దినోత్సవం