తెలంగాణ

telangana

ETV Bharat / state

బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం - World disable day news

బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని హెలెన్ కెళ్లేర్ రీజినల్ అసోసియేషన్ ఆఫ్ డిసెబుల్డ్ ఘనంగా నిర్వహించింది.

బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

By

Published : Dec 3, 2020, 5:12 PM IST

హైదరాబాద్ బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని హెలెన్ కెళ్లేర్ రీజినల్ అసోసియేషన్ ఆఫ్ డిసెబుల్డ్ ఘనంగా నిర్వహించింది. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకులాభరణం కృష్ణ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

దివ్యాంగుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని వకులాభరణం అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు నెలకు రూ.3,116 ఇస్తూ వారికి తోడ్పాటు అందించారని పేర్కొన్నారు. గత పాలకులు దివ్యాంగుల సమస్యలను పట్టించుకోకుండా విస్మరించారని మండిపడ్డారు.

ఇదీ చూడండి:'కేసీఆర్​ కంటే పువ్వాడ గొప్పవాడనే విషయం నాకు తెలియదు'

ABOUT THE AUTHOR

...view details