హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని ఫ్యాప్సీలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కస్టమ్స్ డే వేడుకల్లో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కె.సంధ్యారాణి, జీఎంఆర్ సీఈవో కిషోర్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ తెలంగాణ రాష్ట్రంలో కస్టమ్స్ పనితీరుపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఏ విధంగా అక్రమార్కులను గుర్తిస్తున్నారు, వారి దగ్గర నుంచి బంగారం, విదేశీ కరెన్సీ ఇతర సామాగ్రిని ఎలా స్వాధీనం చేసుకుంటున్నారన్న వివరాలను వెల్లడించారు.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ కస్టమ్స్ డే వేడుకలు
కస్టమ్స్ అధికారులతో కలిసి రాష్ట్రంలో మాదకద్రవ్యాలు, బంగారం స్మగ్లింగ్‌తో సహా అక్రమ కార్యకలాపాలను నియంత్రిస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అత్యుత్తమ పోలీసింగ్ నిర్వహిస్తున్నామన్న డీజీపీ మహేందర్ రెడ్డి... దేశ ఆర్ధికాభివృద్ధిలో కస్టమ్స్ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. కస్టమ్స్ అధికారులతో కలిసి ఎయిర్ పోర్టుల్లో నిర్ధేషించిన లక్ష్యాలను పూర్తి చేస్తున్నామని చెప్పారు. కస్టమ్స్ రెవెన్యూ కలెక్షన్స్‌లో పోస్టల్ డిపార్ట్ మెంట్ కూడా కీలక పాత్ర పోషిస్తోందిని తెలంగాణ రాష్ట్ర చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె. సంధ్యారాణి తెలిపారు. దేశంలో మొత్తం 12 ఫారిన్ పోస్టాఫీసులు ఉన్నాయని, అందులో హైదరాబాద్ ఒకటని వివరించారు. కస్టమ్స్ డిపార్ట్ మెంట్‌తో కలిసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు చేస్తున్నామని వివరించారు.
ఇవీ చూడండి: మహారాష్ట్రలో మరో 'నిర్భయ' తరహా దారుణం