సాగునీటి పొదుపుతో పంటలు పండించడంలో ఆదర్శంగా నిలిచినందుకు తెలుగు రైతుకు అంతర్జాతీయ పురస్కారం దక్కింది. దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సాగునీటి, డ్రైనేజీ కమిషన్(ఐసీఐడీ) అనే స్వచ్ఛంద సంస్థ జాతీయ పురస్కారాలను శుక్రవారం ప్రకటించింది. బిందు, తుంపర్ల సేద్యం ద్వారా ఎరువుల వినియోగంతో పంటలు పండిస్తూ అధిక దిగుబడులు సాధించినందుకు ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన మేకల శివశంకర్‌రెడ్డిని ఉత్తమ రైతుగా ఎంపిక చేసినట్లు ఐసీఐడీ ప్రకటించింది.
తెలుగు రైతుకు అంతర్జాతీయ పురస్కారం - అనంతపురం వార్తలు
బిందు, తుంపర్ల సేద్యం ద్వారా ఎరువుల వినియోగంతో పంటలు పండిస్తూ అధిక దిగుబడులు సాధించినందుకు తెలుగు రైతుకు అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన మేకల శివశంకర్‌రెడ్డిని ఉత్తమ రైతుగా ప్రకటించారు.

తెలుగు రైతుకు అంతర్జాతీయ పురస్కారం
ఆ సంస్థ మొత్తం 4 పురస్కారాలు ప్రకటించగా రైతు విభాగంలో భారతదేశానికి పురస్కారం దక్కింది.
ఇదీ చదవండి:గ్రేటర్ పోరు: సాంకేతిక మీట.. ప్రచార బాట!