తెలంగాణ

telangana

ETV Bharat / state

Agronomy Congress: నేటి నుంచే అగ్రానమి సదస్సు... పోషకాహారంపై చర్చ - Hyderabad news

మరో అంతర్జాతీయ సదస్సు(Agronomy Congress)కు భాగ్యనగరం వేదికైంది. ఇవాళ్టి నుంచి నాలుగు రోజులపాటు ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఐదో అంతర్జాతీయ అగ్రానమి సదస్సు జరగనుంది ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ విధానంలో జరగే సదస్సులో పోషకాహారం అందుబాటులో సవాళ్లు- ఎదుర్కొనే మార్గాలపై చర్చిస్తారు. భారత్‌ సహా 22 దేశాల నుంచి 1,300 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరుకానున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల నేపథ్యంలో పెరుగుతున్న జనాభా, రైతుల ఆదాయాలు పెంపు కోణంలో సుస్థిర వ్యవసాయం లక్ష్యంగా చర్చించనున్నారు.

అగ్రానమి
Agronomy

By

Published : Nov 23, 2021, 5:15 AM IST

వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆహర భద్రత కాపాడుకుంటూ వ్యవసాయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపై ఐదో అంతర్జాతీయ అగ్రానమి సదస్సు (Agronomy Congress) చర్చించనుంది. రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం... ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రానమి సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు ప్రత్యక్ష, పరోక్ష - ఆన్‌లైన్ విధానంలో జరగనున్న ఆ సదస్సును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

వివిధ దేశాల నుంచి...

ప్రపంచ ఆహార పురస్కార గ్రహీత డాక్టర్ రతన్‌లాల్‌, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర... అమెరికన్ సొసైటీ ఆఫ్ అగ్రానమి అధ్యక్షుడు డాక్టర్ పీవీ వరప్రసాద్... ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ డి ఆరోస్‌ హ్యూస్ (Agronomy Congress) తదితరులు పాల్గొంటారు. భారత్‌ సహా అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, జర్మనీ, పిలిప్పీన్స్ సహా వివిధ దేశాల నుంచి... 1,300 మంది ప్రతినిధులు పాల్గొనున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా... వ్యవసాయ ఆవిష్కరణలు, పోషకాహారం అందుబాటులో సవాళ్లు- ఎదుర్కొనే మార్గాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి వెల్చాల ప్రవీణ్‌ రావు తెలిపారు.

సదస్సులో చర్చ...

చిన్న, సన్నకారు రైతుల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆ సదస్సులో చర్చిస్తామని ప్రముఖ అగ్రానమిస్ట్ డాక్టర్ రవీంద్రాచారి తెలిపారు. రైతుల ఆదాయం బలోపేతం దిశగా.... తీసుకోవాల్సిన చర్యలపై సదస్సులో చర్చించనున్నట్లు నిపుణులు వెల్లడించారు.

ఇదీ చూడండి: Gaddiannaram Fruit Market: 'కొహెడ వెళ్లేందుకు సిద్ధం... మధ్యలో ఎక్కడికీ వెళ్లం'

ABOUT THE AUTHOR

...view details