Internal Disputes in Telangana BJP :రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు తమదైన శైలిలో ప్రచారంలో ముందుకెళ్తుంటే.. కాషాయ పార్టీలో నేతల మధ్య విబేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. జాతీయ నాయకత్వం పార్టీలో కొందరికే ప్రాధాన్యం ఇస్తూన్నరంటూ.. మిగిలిన నేతలను పట్టించుకోవడం లేదని ఇతరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అసంతృప్త నేతలు రహస్యంగా సమావేశమయ్యారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి నివాసంలో.. పార్టీ అసంతృప్త నేతల రహస్య సమావేశం జరిగింది.
Amit Shah Speech at Telangana Liberation Day 2023 : 'పటేల్ లేకపోతే.. తెలంగాణకు ఇంత త్వరగా విముక్తి లభించేది కాదు'
బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి నివాసంలో జరిగిన సమావేశానికి విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చాడ సురేశ్ రెడ్డి, గరికపాటి మోహనరావు, ఏనుగు రవీందర్ రెడ్డి, రవీంద్ర నాయక్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే.. బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ వ్యవహార శైలిపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈటల రాజేందర్ ఒంటెద్ధు పోకడలు ప్రదర్శిస్తూ.. నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని నేతలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
T- BJP Internal Clashes :పార్టీలో తమ తరువాత చేరిన ఈటలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల నేతలు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. పరేడ్ మైదానంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవాలకు హాజరైన అమిత్ షా.. తెలంగాణ పర్యటనలో భాగంగా సీఆర్పీఎఫ్ ఆఫీసర్స్ సెక్టార్ మెస్‌లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటలకు మాత్రమే సమయం ఇవ్వడం పట్ల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Kishan Reddy Fires on Telangana Government : 'రాబోయే ఎన్నికల్లో చిన్నపొరపాటు చేసినా.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మర్చిపోవాల్సిందే'
Telangana BJP Latest News :రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌ను ఆహ్వానిస్తే తప్పులేదు కానీ.. ఈటలను కూడా ఆహ్వానించడంపై నేతలు ఊగిపోతున్నారు. ఇతర పార్టీల నుంచి నియోజకవర్గాల్లో చేరికల విషయంలో సీనియర్లను సంప్రదించకపోవడంపైనా ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల ములుగు నుంచి మాజీ మంత్రి చందూలాల్ కుమారుడు, సంగారెడ్డిలో పులిమామిడి రాజు చేరికలపై సమాచారం ఇవ్వకుండానే పార్టీలో చేర్చుకున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల తరువాత జాతీయ నాయకత్వాన్ని కలిసి ఈటల వ్యవహారశైలితో పాటు.. పార్టీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై వివరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Telangana Assembly Elections 2023 :ఏదేమైనా..బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జోరు మీదున్న కాషాయదళం.. ఇప్పుడు కాస్త నెమ్మదించింది. ఇప్పటికే 115 స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల నాడిని పట్టే పనిలో పడింది. తాజాగా తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరి సభలో.. దిల్లీ పెద్దలు 6 గ్యారెంటీ పథకాలు ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.
Kishan Reddy on Railway Projects in Telangana : 'కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఏ ప్రాజెక్టులు కేటాయించినా.. తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదు'