ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది. మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు ఒకేసారి ప్రకటించనున్నారు. మూల్యాంకనం, మార్కుల అప్లోడ్, ఇతర ఫలితాల ప్రక్రియ పూర్తయిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఫలితాల ప్రక్రియను మరోసారి తనిఖీ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఫలితాలపై బుధవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నటు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
రేపు ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం - Intermediate latest updates
ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం, మార్కుల అప్లోడ్, ఇతర ఫలితాల ప్రక్రియ పూర్తయిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. ఫలితాలు బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది.
బుధవారం ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం..
Last Updated : Jun 16, 2020, 6:28 AM IST