Inter exams syllabus: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సిలబస్ పై బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి, రెండో సంవత్సరం పరీక్షల్లో 70శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. తొలగించిన 30 శాతం, పరీక్షల్లో ఇవ్వనున్న 70శాతం సిలబస్ తో పాటు నమూనా ప్రశ్నపత్రాలు www.tsble.cgg.gov.inలో అందుబాటులో ఉంచినట్లు ఇంటర్ బోర్డు కమిషనర్ జలీల్ తెలిపారు. కొవిడ్ ప్రభావంతో సుమారు మూడు నెలల పాటు ప్రత్యక్ష బోధన లేనందున... ఈ నిర్ణయం తీసుకున్నట్లు జలీల్ పేర్కొన్నారు. జనవరి 1న విద్యా సంవత్సరం ప్రారంభంకావల్సి ఉన్నప్పటికీ... సెప్టెంబరు 1 వరకు టీవీల ద్వారా పాఠాలు బోధించాల్సి వచ్చిందన్నారు. కాబట్టి 30శాతం సిలబస్ తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున.. దానికి అనుగుణంగా ప్రశ్నపత్రాలు రూపొందించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు.
Inter syllabus: ఇంటర్ పరీక్షల్లో 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు
17:08 November 22
ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాల గడువు మరోసారి పొడిగింపు
ప్రవేశ గడువు పొడిగింపు
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును(Inter First year admissions) మళ్లీ పొడిగిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రవేశాలకు ఈనెల 30 వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ఈ గడువు ఆగస్టు 30 వరకు ఉండగా... దానిని సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. ఆ తర్వాత సెప్టెంబరు 30 వరకు గడువును పొడిగించారు. మరలా ఇప్పుడు నవంబర్ 30 వరకు తుది గడువు అని ఇంటర్ బోర్డు (telangana inter board) ప్రకటించింది. అయితే ఇదే చివరి సారి అని.. ఇకపై పొడిగించమని బోర్డు స్పష్టం చేసింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో ప్రవేశాలు నమోదవుతున్నాయి. ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాల సంఖ్య లక్ష దాటింది (inter admissions 2021). ఐదారేళ్లుగా ప్రభుత్వ కళాశాలలపై విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో కళాశాలలు, యూనియన్ల అభ్యర్థన మేరకు చివరి అవకాశంగా ఈనెల 30 వరకు ప్రవేశాల గడువు పొడిగించినట్లు జలీల్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:Kishan reddy on kcr: 'సమస్యే కానీ అంశాన్ని సమస్యగా మార్చారు'