మొదటి సంవత్సరం విద్యార్థులు అసైన్‌మెంట్లు సమర్పించే గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. నైతిక, మానవ విలువలు, పర్యావరణం పరీక్షల అసైన్‌మెంట్ల సమర్పణ గడువును ఈనెల 30 వరకు పెంచినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు మే 3 వరకు ఆన్‌లైన్‌లో మార్కుల వివరాలు పంపాలని సూచించారు.
ఇంటర్ విద్యార్థులు అసైన్‌మెంట్లు సమర్పించే గడువు పొడిగింపు - telangana varthalu
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సవరం విద్యార్థులు అసైన్‌మెంట్లు సమర్పించే గడువును బోర్డు పొడిగించింది. సమర్పణ గడువును ఈ నెల 30 వరకు పెంచినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు.
ఇంటర్ విద్యార్థులు అసైన్‌మెంట్లు సమర్పించే గడువు పొడిగింపు
పరీక్షలు, ఇతర ఒత్తిడి నుంచి బయటపడేందుకు బోర్డు నియమించిన మానసిక వైద్య నిపుణుల సలహాలు తీసుకోవాలని కోరారు. మానసిక వైద్య నిపుణుల ఫోన్ నంబర్లు ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని జలీల్ తెలిపారు.
ఇదీ చదవండి: నాలుగు రోజుల్లోగా పట్టణాల్లో చెత్త కనిపించొద్దు: కేటీఆర్