తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్​వార్ రూం కేసు.. దర్యాప్తు నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు - కాంగ్రెస్‌వార్‌ రూం

Police search in Congress war room: కాంగ్రెస్‌వార్‌ రూంలో విధులు నిర్వహిస్తున్న వ్యక్తులపై దర్యాప్తును నిలిపివేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వార్‌రూంలో పనిచేస్తున్న వ్యక్తులను ఎటువంటి కారణాలు లేకుండా రెండురోజులు అక్రమంగా నిర్భందించారని పేర్కొన్న పిటిషనర్​ తరుపు న్యాయవాది.. దానికి గానూ బాధితులకు 20 లక్షల పరిహారం ఇప్పించాలని కోర్టును కోరారు. వీటిపై వాదనలు హైకోర్టు కేసును రేపటికి వాయిదా వేసింది.

High Court
High Court

By

Published : Dec 22, 2022, 1:32 PM IST

Police search in Congress war room: కాంగ్రెస్‌వార్‌ రూంలో విధులు నిర్వహిస్తున్న వ్యక్తులపై దర్యాప్తును నిలిపివేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఎఫ్​ఐఆర్​తో పాటు 41 సీఆర్​పీసీ కింద జారీ చేసిన నోటీసులను కొట్టివేయాలంటూ వేసిన పిటిషన్‌ విచారణను రేపటికి వాయిదా వేసింది. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే వార్‌రూంలో సోదాలు నిర్వహించి.. అక్కడున్న వస్తువులు స్వాధీనం చేసుకున్నారన్నరని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వార్‌రూంలో పనిచేస్తున్న వ్యక్తులను ఎటువంటి కారణాలు లేకుండా రెండురోజులు అక్రమంగా నిర్భందించారని పేర్కొన్నారు.

దానికిగాను బాధితులకు 20 లక్షల పరిహారం ఇప్పించాలని కోర్టును కోరారు. ఈ సందర్భంలో పోలీసుల తరుపున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్​ మధ్యలో కల్పించుకొని పిటిషనర్లను అరెస్టు చేయలేదని విచారించి వదిలివేసినట్లు కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేసును రేపటికి వాయిదా వేసింది. మరో వైపు ఈ కేసుకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ను కొట్టివేయాలని హిమచల్​ప్రదేశ్​కు చెందిన ఇషాన్​ శర్మ, విశాఖపట్నంకు చెందిన శశాంక్​ తాతినేని, విజయవాడ వాసి శ్రీపతాప్​ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details