ఎవర్ని కదిలించినా కన్నీటి గాథలే. కోటి రూపాయల పరిహారం అందిస్తే తమకు న్యాయం జరిగినట్లు కాదనీ, ఇంతటి విషాదానికి కారణమైన పరిశ్రమను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ఏపీలోని విశాఖ జిల్లా ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్థులు. తమ ఆప్తులను పొట్టనపెట్టుకున్న ఆ పరిశ్రమను తరలించేంత వరకు పోరాటం చేస్తామన్నారు.
ప్రాణాలు తీసే కంపెనీ మాకొద్దు: ఆర్ఆర్ వెంటాపురం గ్రామస్థులు - rr venkatpuram victims intraction news
'నాకు ఏ డబ్బూ వద్దు... నాకు నా పాపను ఇవ్వండి చాలు' అంటూ ఓ మాతృమూర్తి రోదిస్తోంది... 'నా భర్త లేని కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలి' అని ఓ భార్య కన్నీరు... 'నా బిడ్డను బలి తీసుకున్న కంపెనీను తరలించే వరకు ఉపేక్షించేది లేదు' అంటూ ఓ తల్లి ఆవేదన... ఇదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆర్ఆర్ వెంకటాపురం మృతుల కుటుంబ సభ్యుల రోదన...
ప్రాణాలు తీసే కంపెనీ మాకొద్దు: ఆర్ఆర్ వెంటాపురం గ్రామస్థులు