సికింద్రాబాద్ గాంధీనగర్ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కోఠిలోని ప్రగతి మహావిద్యాలయంలో అనామిక అనే విద్యార్థిని పరీక్షల్లో తప్పిననే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది.
అసలేం జరిగిందంటే...
సికింద్రాబాద్ గాంధీనగర్ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కోఠిలోని ప్రగతి మహావిద్యాలయంలో అనామిక అనే విద్యార్థిని పరీక్షల్లో తప్పిననే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది.
అసలేం జరిగిందంటే...
ఇంటర్మీడియట్ చదువుతున్న అనామిక నిన్న ఇంటర్ ఫలితాలను చూసుకుంది. ఓ సబ్జెక్టులో తప్పినట్టు తెలుసుకున్న ఆమె ఇంట్లో ఏం అంటారో అనే భయం... స్నేహితులు చులకనగా చుస్తారని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీకి తరలించారు.
ఇదీ చూడండి: మీది ప్రేమేనా... ఓ సారి ఆలోచించుకోండి!
TAGGED:
INTER STUDENT SUCIDE