తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓయూ హత్య కేసులో ఇంటర్ విద్యార్థికి జీవిత ఖైదు

ప్రేమించిన యువతి తనను దూరం పెడుతోందంటూ హత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థికి నాంపల్లి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

ఓయూ హత్య కేసులో ఇంటర్ విద్యార్థికి జీవిత ఖైదుఇదీ చదవండి: గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పూర్తి చేయండి : సీఎస్​
ఓయూ హత్య కేసులో ఇంటర్ విద్యార్థికి జీవిత ఖైదు

By

Published : Jan 21, 2021, 5:09 AM IST

ప్రేమించి తనను దూరం పెడుతోందంటూ ఓ యువతిని హత్య చేసిన ఇంటర్ విద్యార్థికి జీవిత ఖైదు విధిస్తూ నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హైదరాబాద్​ చిలకలగూడ బౌద్ధనగర్​కు చెందిన యువతిని వారాసిగూడకు చెందిన ఆరెపల్లి వెంకట్ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత తనని దూరం పెడుతోందని ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

2018 ఆగస్టులో స్నేహితురాలి సాయంతో యువతిని ఆర్ట్స్ కాలేజీ వద్దకు పిలిపించి పాడుబడిన క్వార్టర్స్​లో కిరాతకంగా హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఓయూ పోలీసులు విచారణ చేపట్టి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సీహెచ్ వీవీఆర్ వరప్రసాద్... ముద్దాయి ఆరెపల్లి వెంకట్​కు జీవితఖైదుతో పాటు రూ. 10వేల జరిమానా విధించారు.

ఈ కేసులో వాదించి శిక్ష పడేటట్లు కృషి చేసిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నారాయణ, విచారణ అధికారులు డీఎస్పీ జగన్, ,సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ నర్సింగరావులను... జాయింట్ కమిషనర్ రమేశ్​ రెడ్డి అభినందించారు.

ఇదీ చదవండి: గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పూర్తి చేయండి : సీఎస్​

ABOUT THE AUTHOR

...view details