ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్ తరగతులు అర్థం కావడం లేదని సూసైడ్ నోట్ రాశాడు. హైదరాబాద్ బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
కంసాలి బజార్‌కు చెందిన యశ్వంత్ మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాళాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కరోనా దృష్ట్యా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో క్లాసులు అర్థం కావడం లేదని.. ఫలితంగా తన లక్ష్యాలను చేరుకోలేనని భావించి బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు నోట్ రాశాడు.
లా చదువుకొని అడ్వకేట్ కావాలనుకున్నా. ఆన్లైన్ తరగతుల్లో చరిత్ర సంబంధించిన క్లాసులు అర్థం కావడం లేదు. సబ్జెక్టు అర్థంకాకపోతే నా లక్ష్యాలను చేరుకోలేను.
- సూసైట్ నోట్లో యశ్వంత్
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసును దర్యాప్తు చేయనున్నట్లు బోయిన్పల్లి ఇన్స్ స్పెక్టర్ అంజయ్య తెలిపారు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇదీచూడండి: విషాదం: వ్యవసాయ బావిలో పడి ఇద్దరు మహిళలు మృతి