విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఎలక్ట్రిషియన్ దొంగతనాల బాట పట్టాడు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగని ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ అబిడ్స్ పోలీసులకు అప్పగించారు.
టాస్క్‌ఫోర్స్ పోలీసుల కథనం ప్రకారం...
మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఒమర్ పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆరు నెలల ఎలక్ట్రిషియన్ కోర్సులో శిక్షణ పొందాడు. అక్కడ సరిగ్గా పనులు లేకపోవడం వల్ల కుటుంబంతో కలిసి 1993లో నగరానికి వచ్చాడు. ఫలక్‌నుమా ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ కరంట్ పనులు చేసేవాడు. స్నేహితులతో పరిచయాలు, ఇతర కారణాలతో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బు సరిపోకపోవడం వల్ల తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. అలా 13కు పైగా దొంగతనాలు చేశాడు.