ఇంటర్ రీవెరిఫికేషన్ ప్రక్రియకు సంబంధించి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితాలకు సంబంధించిన బాధ్యతను గ్లోబరీనాతో పాటు మరో స్వతంత్ర సంస్థకు అప్పగించనుంది. మరో ఏజెన్సీ ఎంపిక అధికారాన్ని టీఎస్టీఎస్కు అప్పగించినట్లు బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. త్రిసభ్య కమిటీ సూచనల మేరకు ఈ మార్పులు చేసినట్లు తెలిపారు. పరీక్షలో ఫెయిలైన సుమారు మూడున్నర లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 8 లక్షల జవాబు పత్రాల పునర్మూల్యాంకనం కొనసాగుతోంది. రెండ్రోజుల్లో ఏజెన్సీ ఖరారయ్యే అవకాశం ఉంది.
ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు.. గ్లోబరీనాతో మరో ఏజెన్సీ
గ్లోబరీనా సంస్థ సాంకేతిక తప్పిదాల వల్ల ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ తప్పులు జరుగుతాయనే తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళన దృష్ట్యా రీవెరిఫికేషన్ ఫలితాల బాధ్యతను గ్లోబరీనాతో పాటు మరో ఏజెన్సీకి అప్పగించనుంది. ఏజెన్సీ ఎంపిక అధికారాన్ని టీఎస్టీఎస్కు అప్పగించినట్లు బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు.
ఇంటర్ ఫలితాలు