తెలంగాణ

telangana

ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: ప్రొఫెసర్ నాగేశ్వర్

గ్లోబరీనా సంస్థకు ఇంటర్ బోర్డ్ మధ్య ఏ ఒప్పందం లేకుండా లక్షలాది మంది విద్యార్థుల ఫలితాల డేటాను ఓ ప్రైవేట్ సంస్థకు ఎలా అప్పగిస్తారు. ఫెయిల్ అయిన విద్యార్థులకే కాకుండా పాస్ అయిన విద్యార్థులకు కూడా  ఉచితంగా రీవేరిఫికేషన్ చేయాలి: ప్రొఫెసర్ నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ

By

Published : Apr 26, 2019, 4:23 PM IST

Published : Apr 26, 2019, 4:23 PM IST

ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: ప్రొఫెసర్ నాగేశ్వర్

ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ గన్​పార్క్ వద్ద తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ మౌన ప్రదర్శన నిర్వహించింది. ఆత్మహత్యలు చేసుకున్న ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని వారు కోరారు. ఇంటర్మీడియట్ ఫలితాల విషయంపై నిపుణుల కమిటీ ఇచ్చిన అంశాలను ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యావేత్తలతో కమిటీ వేసి ఇంటర్మీడియట్ వ్యవస్థను బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: ప్రొఫెసర్ నాగేశ్వర్

ABOUT THE AUTHOR

...view details