కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలోని పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 15 వరకూ డైట్ కళాశాలలకు కూడా సెలవులు పొడిగిస్తున్నట్లు విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
holidays: స్కూళ్లు, కాలేజీల సెలవులు పొడిగింపు... ఇంటర్ ఆన్‌లైన్ తరగతులూ వాయిదా - వేసవి సెలవులు పెంపు
14:12 May 31
స్కూళ్లు, కాలేజీల సెలవులు పొడిగింపు... ఇంటర్ ఆన్‌లైన్ తరగతులూ వాయిదా
ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, పీఆర్టీయూటీఎస్ నేతలు ఇవాళ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సమావేశమై చర్చించారు. కరోనా తీవ్రత, లాక్డౌన్ పొడిగింపు కారణంగా పాఠశాలలు, ఇంటర్ కాలేజీలకు సెలవులు కనీసం రెండు వారాలు పొడిగించాలని కోరారు.
ఇంటర్ ఆన్‌లైన్ తరగతులు వాయిదా..
మంగళవారం ప్రారంభం కావాల్సిన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఆన్‌లైన్ తరగతులను వాయిదా వేసినట్లు బోర్డు ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ప్రైవేట్ కాలేజీల్లో ఆన్‌లైన్ తరగతుల ప్రారంభం, ప్రభుత్వ కళాశాలల పునప్రారంభం వాయిదా వేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. ఆన్ లైన్ తరగతుల తేదీలను తర్వాత ప్రకటిస్తామని జలీల్ తెలిపారు.
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చారు. రేపటి నుంచి ఇంటర్ బోర్డు వెబ్ సైట్ www.tsbie.cgg.gov.inలో ఆన్ లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని జలీల్ పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపళ్లు వేసవి సెలవుల్లో ఆన్ లైన్ ప్రవేశాలు నిర్వహించాలని తెలిపారు.