పీఆర్సీ నివేదికను తక్షణమే తిరస్కరించి ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం కేసీఆర్ స్వయంగా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఇంటర్ విద్య ఐకాస అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి శాశ్వతంగా దూరం అవుతారని ఆయన హెచ్చరించారు. పీఆర్‌సీ 7.5శాతం ప్రకటించినందుకు నిరసనగా హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డులోని జయశంకర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు.
పీఆర్సీ సిఫారసులపై ఇంటర్ విద్య ఐకాస నిరసన - telangana varthalu
పీఆర్‌సీ నివేదికను తిరస్కరించి ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఇంటర్ విద్య ఐకాస డిమాండ్ చేసింది. లేనిపక్షంలో ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి శాశ్వతంగా దూరం అవుతారని ఇంటర్ విద్య ఐకాస అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి హెచ్చరించారు.
పీఆర్సీ సిఫారసులపై ఇంటర్ విద్య ఐకాస నిరసన
గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 43శాతం పీఆర్‌సీ ప్రకటించి విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని... ప్రస్తుతం ధారావాహిక సీరియల్‌గా ఊరించి ఈ పీఆర్‌సీ ప్రకటించారని ఆయన విమర్శించారు. తక్షణమే 47.5 శాతం ఫిట్‌మెంట్‌లో పీఆర్‌సీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని పీఆర్సీ నివేదిక