Inter JAC Chairman Lashed Out At IAS Naveen Mittal: ఇంటర్ బోర్డు మాజీ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆరు కోట్ల ముడుపులు తీసుకున్నారని తెలంగాణ ఇంటర్ విద్యా ఐకాస ఛైర్మన్ మధుసూదన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇంటర్ ఆన్‌లైన్ మూల్యాంకనంలో గ్లోబరినా సంస్థకు మారు పేరుతో అంటగట్టే ప్రయత్నం చేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. కోట్ల రూపాయలకు ఈ కాంట్రాక్టు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు.
గ్లోబరినా సంస్థకు క్లీన్ చిట్ ఇచ్చేందుకు మరో రూ.3కోట్ల ఒప్పందం చేసుకున్నారని వివరించారు. గతంలో ఈ సంస్థ వల్ల 10లక్షల మంది విద్యార్థులు అగమయ్యారని.. 20 మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని మధుసూదన్‌రెడ్డి వెల్లడించారు. ఫ్రీ బిడ్డింగ్ మీటింగ్‌కు కాంపెక్టు సంస్థ వచ్చిందా లేదా అనే విషయంపై నవీన్ మిట్టల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 9వరకు బిడ్‌లకు చివరి గడువు ఉందని.. ఆ కంపెనీ బిడ్ వేసిందా లేదా బయటపెట్టాలని ప్రశ్నించారు. రూ.6 కోట్ల ముడుపులకు నవీన్ మిట్టల్ గ్లోబరినా సంస్థకు అనుకూలంగా పని చేస్తున్నారని.. ఈ సంస్థకు, కాంపెక్టు సంస్థకు సంబంధం లేదని నిరూపించాలని డిమాండ్ చేశారు. గ్లోబరినాకు సీఈఓ వీఎస్‌ఎన్ రాజునే ఈ కాంపెక్టు సంస్థ సీఈఓ కూడా ఆయనే స్పష్టం చేశారు.