తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు నేటి నుంచే

ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఏపీ ఇంటర్ విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. నేటి నుంచి ఈనెల 17 లోపు దరఖాస్తులను కళాశాలలకు సమర్పించాలని తెలిపింది. 18 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది.

By

Published : Jan 7, 2021, 8:02 AM IST

ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు నేటి నుంచే
ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు నేటి నుంచే

ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఏపీ ఇంటర్​ విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని మండలి కార్యదర్శి రామకృష్ణ ఆదేశించారు. ప్రవేశాల సమయంలో పదో తరగతి ఉత్తీర్ణత ధ్రువపత్రం, కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన వెంటనే విద్యార్థులకు వెనక్కి ఇచ్చేయాలని, వాటిని తీసుకుంటే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఏపీ వ్యాప్తంగా అన్ని జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు గురువారం నుంచి దరఖాస్తులను విక్రయించనున్నారు. దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100, ఇతరులకు రూ.200. ఇప్పటికే ఆన్​లైన్​ ప్రవేశాల కోసం రుసుము చెల్లించిన వారు ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. ఫీజు చెల్లింపు రశీదును ప్రిన్సిపల్స్​కు చూపిస్తే సరిపోతుంది. ఈనెల 17లోపు దరఖాస్తులను కళాశాలలకు సమర్పించాల్సి ఉంటుంది. ఆ రోజుతో ప్రవేశాలు పూర్తి చేసి 18 నుంచి తరగతులు ప్రారంభిస్తారు.

ఇవీ చూడండి:ప్రశ్నాపత్రంలో మార్పులకు ఇంటర్​బోర్డు కసరత్తు

ABOUT THE AUTHOR

...view details