తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్ పరీక్షల ఫీజుల తేదీలు ఖరారు.. చివరి తేదీ ఎప్పుడంటే?

By

Published : Jan 4, 2022, 8:50 PM IST

Updated : Jan 5, 2022, 4:52 AM IST

inter exams fee dates
ఇంటర్ పరీక్షల ఫీజుల తేదీలు ఖరారు

20:46 January 04

inter exams fee dates: ఇంటర్ పరీక్షల ఫీజుల తేదీలు ఖరారు.. చివరి తేదీ ఎప్పుడంటే?

inter exams fee dates: రాష్ట్రంలో ఇంటర్ మొదటి, రెండో ఏడాది పరీక్షల ఫీజుల తేదీలను ఇంటర్​ బోర్డు ఖరారు చేసింది. ఇవాల్టి నుంచి 24 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. నిర్ణీత సమయంలో ఫీజు చెల్లించని వారు.. ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు.

ఇంప్రూవ్​మెంట్​ రాసుకోవచ్చు

ఆలస్య రుసుము 100 రూపాయలతో ఈనెల 25 నుంచి 31 వరకు.. రూ.500 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు... రూ.1000 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు... రూ.2 వేలతో ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. ఇటీవల మొదటి సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంప్రూవ్​మెంట్ రాసుకోవచ్చునని బోర్డు పేర్కొంది.

ఫెయిల్ అయిన వారంతా పాస్

ఇటీవల వెలువడిన ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షల్లో చాలా మంది విద్యార్థులు ఫెయిల్​ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. కొంతమంది విద్యార్థులు బలవన్మరణాలకు సైతం పాల్పడ్డారు. ప్రతిపక్షాల ఆందోళనలతో అందరు విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఇలాంటి నిర్ణయాలు ఇక భవిష్యత్తులో ఉండబోవని మంత్రి స్పష్టం చేశారు.

Last Updated : Jan 5, 2022, 4:52 AM IST

ABOUT THE AUTHOR

...view details