Telangana Inter Exams: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మే 5వ తేదీ నుంచి ప్రారంభించాలని ఇంటర్‌బోర్డు భావిస్తున్నట్లు తెలిసింది. జేఈఈ మెయిన్ పరీక్షల తేదీల్లో మార్పు చేసి, ఏప్రిల్ 21 నుంచి మే 4వ తేదీ వరకు నిర్వహించనుండడంతో ఏప్రిల్ 22వ తేదీ నుంచి మొదలుకావాల్సిన ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పు అనివార్యమవుతోంది. దీనిపై ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్ ఏపీ ఇంటర్‌బోర్డు అధికారులతో కూడా చర్చించినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో కొత్త తేదీలను ప్రకటించనున్నారు. ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షలు మొత్తం 16 రోజులు జరుగుతాయి. జేఈఈ మెయిన్‌కు ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మాత్రమే హాజరవుతారు.
Telangana Inter Exams: మేలో ఇంటర్మీడియట్ పరీక్షలు?
Telangana Inter Exams: జేఈఈ మెయిన్ పరీక్షల తేదీల్లో మార్పు చేసి, ఏప్రిల్ 21 నుంచి మే 4వ తేదీ వరకు నిర్వహించనుండడంతో ఏప్రిల్ 22వ తేదీ నుంచి మొదలుకావాల్సిన ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పు అనివార్యమవుతోంది. ఒకటి రెండు రోజుల్లో కొత్త తేదీలను ప్రకటించనున్నారు.
ఎంపీసీ, బైపీసీ, ఇతర గ్రూపుల ప్రధాన సబ్జెక్టులకు 12 రోజులు పరీక్షలు జరగాలి. ఆ ప్రకారం మే 5వ తేదీ నుంచి పరీక్షలను ప్రారంభిస్తే 18వ తేదీకి అవి ముగుస్తాయి. మధ్యలో రెండు ఆదివారాలు వస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆదివారాల్లో కూడా పరీక్షలు జరిపితే 16వ తేదీతో పూర్తవుతాయి. జేఈఈ మెయిన్ చివరి విడత మే 24 నుంచి మొదలవుతుంది. విద్యార్థులు దానికి సిద్ధం కావడానికి మధ్యలో వారం వ్యవధి వస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ సెకండియర్‌తో పరీక్షలు ప్రారంభిస్తే మరొక రోజు వెసులుబాటు లభిస్తుందని కూడా యోచిస్తున్నారు. కానీ మే 4న జేఈఈ మెయిన్ రాసిన వారు మర్నాడే ఇంటర్ పరీక్ష రాయాలన్నదే సమస్య. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ)కి విజ్ఞప్తి చేస్తే తేదీల్లో వెసులుబాటు లభించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: Telangana Inter Exams Schedule : ఇంటర్ పరీక్షల తేదీలపై పునరాలోచన