తెలంగాణ

telangana

ETV Bharat / state

కొనసాగుతున్న ఇంటర్​ పరీక్షలు... సెట్‌-ఏ ప్రశ్నపత్రం ఎంపిక - ఇంటర్​ పరీక్షలు 2020

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్​ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.పేపర్‌-1 ప్రశ్నపత్రం 'సెట్‌-ఏ'ను ఎంపిక చేశారు.

inter-exams-started-in-telangana
కొనసాగుతున్న ఇంటర్​ పరీక్షలు... సెట్‌-ఏ ప్రశ్నపత్రం ఎంపిక

By

Published : Mar 4, 2020, 9:08 AM IST

Updated : Mar 4, 2020, 10:03 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఇంటర్​ మొదటి సంవత్సర విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్మీడియట్‌ పరీక్ష పేపర్‌-1 ప్రశ్నపత్రం 'సెట్‌-ఏ'ను ఎంపిక చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా... మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది.

ఇంటర్​ పరీక్షలకు 1,339 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 25,550 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో కనీసం నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

కాగజ్‌నగర్‌లో ఇంటర్ పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థినికి అధికారులు అనుమతి నిరాకరించారు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థినిని అధికారులు తిప్పిపంపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బాలుర జూనియర్​ కళాశాలలో ఇంటర్​ విద్యార్థి భానుప్రసాద్​ ఆలస్యంగా రావడం వల్ల పరీక్ష రాయడానికి అనుమతి ఇవ్వలేదు.

ఇవీ చూడండి:'కరోనా ఎఫెక్ట్: షేక్ హ్యాండ్ వద్దు.. నమస్కారం చాలు'

Last Updated : Mar 4, 2020, 10:03 AM IST

ABOUT THE AUTHOR

...view details