తెలంగాణ

telangana

ETV Bharat / state

'కులాంతర వివాహం చేసుకున్న వారికి అండగా ఉండాలి'

కులాంతర వివాహం చేసుకున్న వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వాళ్లకు సమస్యలు వచ్చినప్పుడు కుల నిర్మూలన సంఘం వారికి అండగా ఉండాలని సూచించారు. ఇందిరాపార్క్​లో నిర్వహించిన కులాంతర, మతాంతర వివాహితుల మేళా-48వ వార్షికోత్సవ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Inter-caste married should be benevolent minister eetala rajendar
'కులాంతర వివాహం చేసుకున్న వారికి అండగా ఉండాలి'

By

Published : Jan 26, 2020, 11:46 PM IST

కులాంతర, మతాంతర వివాహితుల మేళా-48వ వార్షికోత్సవం హైదరాబాద్​ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించారు. ఆ సమావేశానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు.

మతాంతర వివాహం చేసుకున్న వారికి ఉన్నంతలో కొంత చేయూత నివ్వాలన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని గొప్ప రాజ్యాంగాన్ని అంబేడ్కర్ మనకు అందించారని మంత్రి అన్నారు. కుల, మత, లౌకిక అంతరాలు లేని సమాజం ఏర్పడాలని అంబేడ్కర్ కళలు కన్నారని గుర్తుచేశారు.

'కులాంతర వివాహం చేసుకున్న వారికి అండగా ఉండాలి'

ఇదీ చూడండి : మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపికపై కసరత్తు...

ABOUT THE AUTHOR

...view details