మార్చి 4 నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇంటర్ బోర్డు సభ్యులు సమావేశమయ్యారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి నిరాకరణ నిబంధనను అమలు చేయనున్నారు. విద్యార్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది.
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం... నిమిషం నిబంధన యథాతథం - inter board suggestions to students
మార్చి 4 నుంచి ఇంటర్ పరీక్షలు మొదలవుతున్నందున... ఇంటర్ బోర్డు విద్యార్థులకు పలు సూచనలు చేసింది. పరీక్షా కేంద్రంలోకి నిమిషం ఆలస్యమైనా అనుమతించమని తెలిపారు. విద్యార్థుల కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించం: ఇంటర్ బోర్డు
ఇంటర్ విద్యార్థుల కోసం అదనపు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల కోసం బస్టాపుల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పరీక్షలు రాసే విద్యార్థులను నేల మీద కూర్చోబెడితే ఆ కళాశాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హాల్‌టికెట్ల డౌన్లోడ్, పరీక్ష కేంద్రాల లొకేటర్ యాప్ ఇతర ఏర్పాట్లపై విస్తృత ప్రచారం కల్పిస్తామని తెలిపారు.
ఇదీ చదవండిఃఅమ్మను వదిలించుకునేందుకు ఆ కొడుకు ఏం చేశాడో తెలుసా?