ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు పర్యావరణం, నైతిక, మానవ విలువల పరీక్షల అసైన్మెంట్లను ఏప్రిల్ 1 నుంచి 20 మధ్య సమర్పించాలని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. పర్యావరణం, నైతిక-మానవ విలువల పరీక్ష అసైన్ మెంట్ రూపంలో నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
ప్రశ్నలకు ఇంట్లోనే సమాధానాలు రాసి నేరుగా లేదా రిజిస్టర్డ్ పోస్టు లేదా మెయిల్ ద్వారా కళాశాలకు సమర్పించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి పేర్కొన్నారు. అసైన్మెంట్లపై హాల్టికెట్ నెంబర్లను తప్పనిసరిగా రాయాలని జలీల్ స్పష్టం చేశారు.