Interboard exam fees Dates: ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు ప్రకటించింది. మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు ఆలస్య రుసుము లేకుండా ఈనెల 14 నుంచి 30 వరకు ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు తెలిపింది. ఆలస్య రుసుము రూ.100 చెల్లించి డిసెంబరు 2 నుంచి 6వరకు, రూ.500 చెల్లించి డిసెంబరు 8 నుంచి 12 వరకు, రూ.వెయ్యి ఆలస్య రుసుముతో డిసెంబరు 14 నుంచి 17 వరకు, రూ.2వేలు చెల్లించి డిసెంబరు 19 నుంచి 22 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు వెల్లడించింది. మొదటి, రెండో సంవత్సరం ఆర్ట్స్ విద్యార్థులు రూ.500, మొదటి సంవత్సరం ఒకేషనల్, రెండో సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు రూ.710 ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు.
వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించిన ఇంటర్ బోర్డు - inter board
Interboard exam fees Dates: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజుల చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు ప్రకటించింది. మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 14 నుంచి 30 లోపు ఫీజులు చెల్లించవచ్చని ఇంటర్‌బోర్డు పేర్కొంది.
వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించిన ఇంటర్ బోర్డు