ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను భారీగా పెంచేందుకు ఇంటర్ బోర్డు నిర్ణయించింది. 600 పరీక్ష కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. కరోనా పరిస్థితుల కారణంగా భౌతిక దూరం పాటించాల్సి ఉన్నందున ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.
పరీక్ష కేంద్రాలను పెంచేందుకు ఇంటర్ బోర్డు నిర్ణయం - Inter-Board latest news
పరీక్షల కోసం ఇంటర్ బోర్డు కసరత్తులు ప్రారంభించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో భౌతిక దూరం పాటించాల్సి ఉన్నందున పరీక్ష కేంద్రాలను పెంచేందుకు నిర్ణయించింది. మరో 600 కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయనుంది.
పరీక్ష కేంద్రాలను పెంచేందుకు ఇంటర్ బోర్డు నిర్ణయం
మే 3 నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,369 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది అదనంగా 600 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. జూనియర్ కాలేజీలు సరిపోనందున సుమారు 200 పాఠశాలలు, మరో 200 డిగ్రీ కాలేజీలనూ పరీక్ష కేంద్రాల కోసం ఎంపిక చేశారు.
ఇదీ చూడండి: 'మిథానిలో కేంద్ర వాటా తగ్గింపునకు ప్రయత్నిస్తున్నాం'