తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. మే 16 నుంచి జరగాల్సిన ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 25కు వాయిదా వేస్తున్నట్లు బోర్డు వెల్లడించింది.

By

Published : Apr 28, 2019, 7:23 PM IST

ఇంటర్​బోర్డు

ఇంటర్మీడియట్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. మే 16 నుంచి జరగాల్సిన సప్లిమెంటరీ పరీక్షలను మే 25 నుంచి నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. మే 16 నుంచి జూన్ 1 వరకు ప్రధాన పరీక్షలు జరగనున్నాయి. జూన్ 3న నైతిక, మానవ విలువలు, జూన్ 4న పర్యావరణం పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. జూన్ 7 నుంచి పదో తరగతి వరకు సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు.

ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా
మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు... ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 12.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఉంటాయి. సప్లిమెంటరీ పరీక్షకు దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాల రీవెరిఫికేష్ ప్రక్రియ కొనసాగుతోంది. రీవెరిఫికేషన్ ఫలితాల వెల్లడికి సుమారు పదిహేను రోజులు పట్టే అవకాశమున్నందున... సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేశారు.

ABOUT THE AUTHOR

...view details