తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్లోబల్ సిటీ కోసం ఇంటెలెక్చువల్ ట్యాగ్ - INTERNATIONAL CRAFT VILLAGE ACADEMY

తెలంగాణలో పర్యటక శాఖ సహకారంతో మరిన్ని ఈవెంట్లు నిర్వహించేందుకు సీఐఐ సిద్ధమైంది. ఇందుకు సహకారం అందించాలని ప్రతినిధులు పర్యటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంను విజ్ఞప్తి చేశారు.

క్రాఫ్ట్‌ విలేజ్‌ అకాడమీలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉండాలి

By

Published : Feb 12, 2019, 6:04 PM IST

సీఐఐ ఆధ్వర్యంలో ఏర్పడనున్న ఇంటర్నేషనల్‌ క్రాఫ్ట్‌ విలేజ్‌ అకాడమీలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు ఉండాలి : బుర్రా వెంకటేశం
హైదరాబాద్ గ్లోబల్ సిటీపై సీఐఐ జియోగ్రాఫికల్ ఇంటెలెక్చువల్‌ ట్యాగ్ రూపొందిస్తోంది. ఈ విషయాన్ని సీఐఐ మాజీ ఛైర్మన్ వనిత దాట్ల వెల్లడించారు. ఇందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని ఆమె ఇవాళ పర్యటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని వనిత దాట్ల పేర్కొన్నారు.
హైదరాబాద్​లో సీఐఐ ఆధ్వర్యంలో ఏర్పడనున్న ఇంటర్నేషనల్‌ క్రాఫ్ట్‌ విలేజ్‌ అకాడమీలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, కళలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సీఐఐ ప్రతినిధులకు బుర్రా వెంకటేశం సూచించారు.

ABOUT THE AUTHOR

...view details